![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -854 లో.. రిషి అన్న మాటలు గుర్తుచేసుకొని ఏంజిల్ బాధపడుతుంటుంది. అప్పుడే తన దగ్గరికి విశ్వనాథ్ వచ్చి.. ఎందుకు అలా ఉన్నావని అడుగుతాడు. దానికి సమాధానం చెప్పకుండా నీకు టాబ్లెట్స్ ఇవ్వాలని చెప్పి విశ్వనాథ్ కి ఇస్తుంది. ఆ తర్వాత రిషి ఇంకా ఇంటికి రాలేదేంటని తన కోసం ఎదురు చూస్తంటుంది ఏంజిల్. ఫోన్ చేస్తే కోప్పడతాడు అనుకొని ఫోన్ చెయ్యకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంజిల్.
ఆ తర్వాత అసలు రిషి, వసుధారల మధ్య ప్రేమ ఉందా? అందుకే అలా చేస్తున్నారా నాకు చెప్పట్లేదా? ఉంటే నేను పక్కకి జరిగేదాన్ని కదా అని ఏంజిల్ అనుకుంటుంది. ఒకవేళ అలాంటిది ఉంటే చెప్పేవాళ్ళు కదా? వాళ్ళ గురించి అలా ఆలోచించడం కరెక్ట్ కాదని ఏంజిల్ అనుకుంటుంది. మరొక వైపు ఏంజిల్ తన పట్ల ప్రవర్తించే తీరుని రిషి గుర్తు చేసుకుంటాడు. అసలు ఇంటికి వెళ్ళాలని లేదు. అలా అని వెళ్లకుండా ఉండలేనని కాలేజీలోనే ఉంటాడు రిషి. అప్పుడే రిషి దగ్గరికి వసుధార వచ్చి.. ఇంకా ఇంటికి వెళ్ళలేదని అడుగుతుంది. ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి. నేను చేస్తానని వసుధార అంటుంది. అవసరం లేదని అక్కడ నుండి వెళ్ళిపొమ్మని రిషి చెప్తాడు.. వసుధార వెళ్తు వెళ్తు రిషి వైపు అదోలా చూసేసరికి.. ఆ కళ్ళతోటే నన్ను నీ ప్రేమలో పడేసావంటూ తనతో ప్రేమలో
ఉన్న రోజులని గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత వసుధార కళ్ళను పెన్సిల్ తో డ్రా చేస్తాడు రిషి. అప్పుడే కరెంటు పోవడం వల్ల డ్రాయింగ్ మధ్యలోనే పక్కకి పెట్టి రిషి వెళ్ళిపోతాడు. మరొకవైపు ఇంకా రిషి రాలేదని ఏంజిల్ ఫోన్ చేస్తుంది.. కావాలనే ఏంజిల్ ఫోన్ ని రిషి లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత రిషి ఆలోచనలో పడి వసుధార ఇంటి దగ్గరికి వచ్చి ఆగుతాడు. ఇప్పుడు వసుధారతో మాట్లాడి నా గుండెల్లో భారం దించుకోవాలని రిషి లోపలికి వెళ్తాడు.
ఆ తర్వాత రిషిని చూసిన వసుధార లోపలికి పిలిచి భోజనం చెయ్యమని అడుగుతుంది. రిషి ఒప్పుకోడు చక్రపాణి రిక్వెస్ట్ చెయ్యగా.. రిషి భోజనం చేస్తాడు. వసుధార నీకు పెళ్లి చెయ్యాలని నా కోరిక అని చక్రపాణి అనగానే.. రిషి సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే వసుధార దగ్గరికి ఏంజిల్ వస్తుంది. ఏంజెల్ ని చూసిన రిషి.. నేను ఇక్కడ ఉన్నానని చెప్పకండని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు. ఏంజిల్ లోపలికి వచ్చి రిషి ఇంకా రాలేదు. నీకు ఏమైనా తెలుసా అని వసుధారని ఏంజిల్ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |